బాలీవుడ్ బ్యూటీ యోగా వీడియో!

శిల్పాశెట్టి ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొండింది. తెలుగు సినిమాల్లో కూడా నటించింది. అప్పట్లో ఆమె యోగాను ప్రమోట్ చేస్తూ… ఓ వీడియోను విడుదల చేశారు. అదొక సెన్సేషన్ గా మారింది. కెరీర్ మొదట్లో ఆమె ఎలా ఉన్నారో… ఇప్పటికీ అదే ఫిట్ నెస్ ను మెయిన్టెయిన్ చేస్తున్నారు. ఆమెకు పెళ్లయ్యి.. ఓ బిడ్డ పుట్టిన తరువాత కూడా అదే ఫిజిక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇది ఇలా ఉండగా ఓ సంస్థ శిల్పాశెట్టిని సరికొత్త యోగాసనాలతో కూడిన వీడియోను రూపొందిస్తున్నామని,దానికోసం ఆమెను పని చేయవలసిందిగా కోరారు.
 
దానికి మరో ఆలోచన లేకుండా శిల్పా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో శిల్పాతో పాటు ఆమెసోదరి షమితా శెట్టిని కూడా నటింపజేయనుంది. ఈ వీడియో దాదాపు పది ‘మోడ్రన్ యోగా’ విధానాలుదర్శనమివ్వబోతున్నట్లు టాక్. వరల్డ్ వైడ్ ఈ వీడియోను పాపులర్ చేయాలనేది సంస్థ ముఖ్య ఉద్దేశ్యం.దీనికోసం శిల్పాశెట్టి భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ వీడియోనువిడుదల చేయనున్నారు.