HomeTelugu Trendingకోలీవుడ్ నటుడు విజయ్ కాంత్‌కు అస్వస్థత

కోలీవుడ్ నటుడు విజయ్ కాంత్‌కు అస్వస్థత

Vijaykanth hospitalized
కోలీవుడ్‌ ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్‌ విజయ్‌ కాంత్‌ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కుటుంబ సభ్యలు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విజయ్‌ కాంత్ చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డీఎండీకే ఓ ప్రకటనలో పేర్కొంది. విజయ్‌ కాంత్‌ గతేడాది కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu