HomeTelugu Trendingఆరోగ్యంగానే ఉన్నాను.. ఫొటో షేర్‌ చేసిన విజయ్‌ కాంత్‌

ఆరోగ్యంగానే ఉన్నాను.. ఫొటో షేర్‌ చేసిన విజయ్‌ కాంత్‌

vijayakanth shares photo an

కోలీవుడ్ న‌టుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ చికిత్స కోసం దుబాయ్ కి వెళ్లిన విష‌యం తెలిసిందే. తాజాగా విజయ్‌ కాంత్‌ తాను ఆరోగ్యంగానే ఉన్నానని ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. నర్సులతో కలిసి కాలక్షేపం చేస్తున్న ఫొటోను పోస్ట్‌ చేశారు.

తాను నటించిన క్షత్రియన్ సినిమాను ఆసుప‌త్రిలో నర్సు లతో కలిసి చూసిన‌ట్లు చెప్పారు. కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధప‌డుతోన్న విష‌యం తెలిసిందే. గ‌తంలోనూ ఆయ‌న ప‌లు సార్లు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అప్ప‌ట్లో అమెరికాలోనూ చికిత్స తీసుకుని తిరిగి వ‌చ్చారు. గత ఏడాది ఆయ‌న‌ కరోనా బారిన కూడా పడ్డారు. కరోనా సైడ్ ఎఫెక్టుల వల్ల ఆయ‌న‌ ఆరోగ్యం దెబ్బతిన్నట్టు కొన్ని నెలలుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu