HomeTelugu Trendingశరత్‌బాబు సోదరుడు కొడుకు హీరోగా ‘దక్ష’

శరత్‌బాబు సోదరుడు కొడుకు హీరోగా ‘దక్ష’

Actor sarath babu nephew as

ప్రముఖ నటుడు శరత్‌బాబు సోదరుడి కుమారుడు ఆయుష్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘దక్ష’. ఈ సినిమాలో అను, నక్షత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివేకానంద విక్రాంత్‌ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ లోగోను తనికెళ్ల భరణి, శరత్‌కుమార్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా తనికెళ్ల మాట్లాడుతూ – ‘‘దక్ష’ అంటే అన్ని వ్యవహారాలు సమన్వయం చేసేవాడని అర్థం. అతడే మా తల్లాడి సాయికృష్ణ.

చిన్న స్థాయి నుంచి వచ్చిన సాయికృష్ణ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఆయుష్‌ నాక్కూడా కొడుకులాంటివాడే. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు శరత్‌బాబు. ‘‘హీరో అవ్వాలన్న నా కల ఈ చిత్రంతో నేరవేరింది. ఈ థ్రిల్లర్‌ మూవీని వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అన్నారు ఆయుష్‌. ‘‘షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అన్నారు సహనిర్మాత తల్లాడ సాయికృష్ణ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!