
Coolie vs War 2:
సమ్మర్ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి పెద్ద హిట్ దొరకలేదు. శేఖర్ కమ్ముల “కుబేర” ఓ ఊపిరి లాంటి హిట్ ఇచ్చినా, మరో బ్లాక్‌బస్టర్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడంతా కన్నప్ప విడుదలను ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూలైలో “తమ్ముడు”, “ఘాటి”, “హరి హర వీర మల్లు”, “కింగ్‌డమ్” లాంటి సినిమాలు రేస్‌లో ఉన్నాయి.
అయితే అసలైన పోరు ఆగస్టులోనే జరగబోతోంది! రజనీకాంత్ “కూలీ” vs ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ “వార్ 2” – ఈ రెండు సినిమాలు ఆగస్టు 14న దేశవ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదొక భారీ క్లాష్ అనడంలో సందేహమే లేదు.
ఈ కాంపిటీషన్ మధ్యలో “కూలీ” తెలుగు రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా హిట్ అయితే తప్ప, డిస్ట్రిబ్యూటర్స్‌కు బ్రేక్ ఈవెన్ కష్టమే. ఇక “వార్ 2” విషయానికి వస్తే, యష్ రాజ్ ఫిలింస్ తెలుగులో డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తున్నది. ఎన్టీఆర్‌కి భారీ రెమ్యునరేషన్ చెల్లించడమూ, హై బడ్జెట్ కూడా ఇందులోనే లెక్క.
తెలుగు మార్కెట్‌లో ఈ రెండు సినిమాలు ట్రిపుల్ డిజిట్ గ్రాస్ సాధించాల్సిందే అన్నదే టార్గెట్. కానీ వీటికి లాంగ్ హాలిడే వీకెండ్ ప్లస్ పాజిటివ్ టాక్ కలిస్తే, రెండు సినిమాలకూ మంచి ఓపెనింగ్స్ రావచ్చు. కానీ ఇదే టాక్ నెగెటివ్ అయితే మాత్రం ఇద్దరికీ బిగ్ రిస్క్.
అందుకే ఇప్పుడు తెలుగు మార్కెట్‌లో “కూలీ” – “వార్ 2” మధ్య ఓపెనింగ్ పోరు మొదలైంది.
ALSO READ: War 2 కి ఇదే కదా కావాల్సింది.. ఎన్టీఆర్ ప్లాన్ ఏంటి?













