HomeTelugu Trendingపండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్‌

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్‌

7 21

మెగా హీరో రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమాలో హీరోయిన్‌గా అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తరువాత అమీ.. శంకర్ తో ‘ఐ’ సినిమా చేసింది. విక్రమ్ నటనకు మంచి మార్కులు పడ్డా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఐ సినిమా ఫెయిల్ అయినా అమీకి శంకర్ రజినీకాంత్ తో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. 2పాయింట్ 0 సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది.

ఆమె ప్రెగ్నెంట్ కావడంతో 2పాయింట్ 0 తరువాత మరో సినిమా చేయలేదు. లండన్‌కు చెందిన పారిశ్రామిక వేత్త జార్జ్ పయనట్టుతో ప్రేమలో పడింది. పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ కావడంతో హడావుడిగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే అమీ కొన్ని ఫోటోషూట్ లు చేసి వావ్ అనిపించింది. కాగా, ఇప్పుడు అమీ పండంటి మగబిడ్డకు జన్మను ఇచ్చినట్టు ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

View this post on Instagram

Our Angel, welcome to the world Andreas 💙

A post shared by Amy Jackson (@iamamyjackson) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu