HomeTelugu Trendingబాలీవుడ్‌లో మరో విషాదం..

బాలీవుడ్‌లో మరో విషాదం..

divvya chouksey 1

ఈ సంవత్సరం (2020) సినీ ప్రరిశ్రమకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇక బాలీవుడ్‌తో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ వంటి నటుల మరణాలు బాలీవుడ్‌ను శోక సంద్రంలో ముంచెత్తాయి. మరోవైపు ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. తాజాగా బాలీవుడ్‌లో ‘హై అప్పా దిల్ తోహ్ అవారా’ చిత్రంలో నటించిన ప్రముఖ మోడల్, నటి, గాయని దివ్య చోక్సీ (29) కన్నుమూశారు. దివ్య చౌక్సే కేన్సర్‌తో నిన్న అర్ధరాత్రి తుది శ్వాస విడిచింది. దివ్యచౌక్సే మృతిపై ఆమె బంధువు అమిష్ వర్మ ధృవీకరించారు. దివ్య మృతిపై పలువురు నటులు తమ సంతాపం తెలియజేశారు. దివ్య చౌక్సే కన్నుమూసే కొన్ని గంటల ముందు తన ఇన్‌స్టాగ్రామ్ అభిమానుల కోసం గుడ్‌బై అంటూ.. ఓ విషాదకర పోస్ట్ చేశారు.

సుదీర్ఘం కాలం క్యాన్సర్‌ తో బాధపడుతూ నెలల తరబడి మరణశయ్యపై ఉన్నాను. బాధ లేని మరో జన్మలో కలుద్దాం…సెలవంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులో తుది వీడ్కోలు తీసుకున్నారు. దివ్య చౌక్సే సినిమాలకు ముందు పలు యాడ్ ఫిల్మ్స్2 , టెలివిజన్ షోలతో ప్రేక్షకులకు దగ్గరైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!