
Bigg Boss 19 Contestants List:
బిగ్‌బాస్ అభిమానులకు గుడ్ న్యూస్! బిగ్‌బాస్ 19 మరోసారి తెరపైకి రాబోతుంది. ఈసారి కూడా హోస్ట్‌గా సల్మాన్ ఖాన్నే కొనసాగనుండగా, ఇప్పటికే షోపై బజ్ మొదలైంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, జూలైలో షో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.
తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం, షో కోసం పలువురు సెలబ్రిటీలతో చర్చలు జరుగుతున్నాయి. కొందరితో ముందడుగు కూడా పడింది అంటున్నారు. బాలీవుడ్, టెలివిజన్ ఫీల్డ్‌కి చెందిన వారిని ఈసారి ఎక్కువగా తీసుకునే ఛాన్సులు ఉన్నాయి.
అందుబాటులో ఉన్న టెంటేటివ్ లిస్ట్ ప్రకారం బిగ్‌బాస్ 19కి ఎంపికైనవారు:
1. అలీషా పన్వార్
2. రాజ్ కుంద్రా
3. ధీరజ్ ధూపార్
4. కృష్ణ ష్రాఫ్
5. ఫ్లయింగ్ బీస్ట్
6. మున్మున్ దత్తా
7. కనికా మన్న్
8. ఫైసల్ షేక్ అలియాస్ మిస్టర్ ఫైసూ
9. అపూర్వ ముఖిజా అలియాస్ రెబెల్ కిడ్
10. డైసీ షా
11. ఖుషీ దూబే
12. రామ్ కపూర్
13. అరిష్ఫా ఖాన్
14. గౌతమీ కపూర్
ఈ లిస్ట్ ఖచ్చితంగా ఫైనల్ కాదు. ప్రీమియర్‌కి వారం ముందు మాత్రమే అసలైన పార్టిసిపెంట్ల లిస్ట్ బయటపెడతారు.
ఇక సల్మాన్ ఖాన్ జూన్ చివర్లో ప్రమో షూట్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఎండెమోల్ షైన్ ఇండియా సంస్థ ఈ షోను మళ్లీ నిర్మిస్తుండగా, హై-వోల్టేజ్ డ్రామా, ఎమోషన్స్, కంట్రవర్సీలతో మిలియన్ల మందిని ఆకట్టుకునేలా బిగ్‌బాస్ 19 సిద్ధమవుతోంది.