HomeTelugu Trendingనిజంగానే సిగరెట్‌ కాల్చానంటున్న యాంకర్‌

నిజంగానే సిగరెట్‌ కాల్చానంటున్న యాంకర్‌

7
బిగ్‌బాస్‌ షో ద్వారా ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు తెచ్చుంది యాంకర్‌ హరితేజ. లాక్‌డౌన్‌ నేపద్యంలో తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా, ఆమె నటించిన ‘హిట్‌’ సినిమా గురించి ఓ అభిమాని ప్రస్తావిస్తూ… ఆ‌ సినిమాలో ఆమె చేసిన షీలా పాత్ర చాలా బాగుందని, ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో మీరు సిగరెట్‌ కాల్చారని గుర్తు చేశాడు. మరి నిజంగానే అప్పుడు సిగరెట్‌ కాల్చారా మేడం? అని ప్రశ్నించాడు.

దానికి హరితేజ సమాధానం చెబుతూ.. హిట్‌ సినిమాలో తాను పోషించిన పాత్ర డిమాండ్‌ చేసిందని, దీంతో తప్పలేదని, నిజంగానే తాను సిగరెట్‌ కాల్చానని తెలిపింది. కాగా, ఆమె తన వయసెంతో కూడా ఈ సందర్భంగా చెప్పేసింది.వయసెంతో చెప్పాలని ఓ నెటిజన్ అడగగా.. తాను ఈ విషయం చెబితే ఎవరూ నమ్మరని అంటూనే, 24.02.1992న తాను పుట్టానని చెప్పుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu