‘చిత్రం 1.1’ లో హీరోగా తేజ కొడుకు!

టాలీవుడ్‌లో ‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు తేజ. తొలి సినిమాతోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ చిత్రంతో ఉదయ్‌కిరణ్‌, రీమాసేన్‌ హీరో, హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో.. ఇద్దరూ స్టార్స్‌గా ఎదిగారు. ఈ చిత్రం అప్పట్లోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచి నిర్మాతలకు కాసులు కురిపించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా `చిత్రం 1.1` సినిమాని రూపొందిస్తున్నారు.

ఈ సినిమాతో తేజ తన కొడుకు అమిత‌వ్ తేజని హీరోగా పరిచయం చేయనున్నాడు. ఇందుకోసం విదేశాల్లో శిక్షణ కూడా ఇప్పించినట్లు సమాచారం. ఈనెల 18న ఈ చిత్రం షూటింగ్‌ పప్రారంభం కానుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది.

CLICK HERE!! For the aha Latest Updates