
ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్భూ సందర్ ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఖుష్బూ సోషల్ మీడియాలో తెలిపింది. ‘వెన్నుముక సమస్యతో హాస్పిటల్‌లో చేరాను. రెండు రోజులు విశ్రాంతి అవసరం. కోలుకున్నాక విధుల్లో మళ్ళీ యథావిధిగా పాల్గొంటాను’ అని ట్వీట్ చేసింది. అంతేకాకుండా అభిమానులకు దసరా శుభాకాంక్షలను తెలిపింది. దాంతో నెటీజన్‌లు గెట్ వెల్ సూన్, టేక్ కేర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించి ‘మీరు త్వరగా కోలుకొని తిరిగి దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.













