HomeTelugu Trendingత్రిష వీడియో లీక్ చేస్తానంటున్న మీరా మిథున్

త్రిష వీడియో లీక్ చేస్తానంటున్న మీరా మిథున్

Meera Mithun controversal 1
తమిళ సినీ పరిశ్రమలో అందాల భామలు త్రిష, మీరా మిథున్‌ల మధ్య ఎప్పటి నుంచో వైరం నడుస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా త్రిషపై మీరా విరుచుకుపడుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో విధంగా త్రిషను టార్గెట్ చేస్తున్న మీరా.. తాజాగా త్రిషపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. త్రిష బండారం బయటపెడతాను, ఆమెకు సంబంధించిన వీడియో కూడా ఉందనటంతో అందరూ షాక్ అవుతున్నారు. తమిళ బిగ్‌బాస్ సీజన్-3లో పార్టిసిపేట్ చేసి కాంట్రవర్సీలతో జనాలను ఆకట్టుకుంది ముద్దుగుమ్మ మీరా మిథున్. అంతే కాకుండా తమిళంలోని థన్నా సెర్నదా కొట్టమ్, తొట్టకాల్ చిత్రాల్లో నటించింది.

మీరా మిథున్ చేసింది చిన్న పాత్రలే అయినా ఈ ముద్దుగుమ్మ కాంట్రవర్సీ కామెంట్లతో తమిళంలో క్రేజ్ దక్కించుకుంది. సీనియర్ హీరోయిన్ త్రిషకు కోలీవుడ్ మాఫియాతో సంబంధాలున్నాయని కామెంట్లు చేస్తోంది మీరా. త్రిషకు సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేస్తానని చెప్పడం కొత్త వివాదానికి దారి తీస్తోంది. త్రిష తనకు చాలా సినిమాల్లో అవకాశాలు రాకుండా చేసిందని ఆరోపిస్తోంది. రజనీకాంత్ పెట్ట సినిమాలో తనకు అవకాశం రాకుండా చేసిందంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu