HomeTelugu Newsవయసుతో పాటు అందమూ పెరుగుతుందా..!

వయసుతో పాటు అందమూ పెరుగుతుందా..!

9 19గ్లామర్ ప్రపంచంలో గ్రామర్ తో పనిలేకపోయినా.. గ్లామర్ మాత్రం చాలా అవసరం. అందుకే అందం విషయంలో చాలా కేర్ తీసుకుంటుంటారు. అందంగా ఉండాలంటే ముందు మనసు ఆనందంగా ఉండాలి. వయసు పెరిగినా.. తరిగిపోని అందాన్ని సొంతం చేసుకోవచ్చు అంటోంది బాలీవుడ్ హీరోయిన్ టబు. 47 సంవత్సరాల వయసులోనూ చాలా అందంగా కనిపిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచింది టబు.

1971 లో పుట్టిన టబు, 1980లో వచ్చిన బజార్ సినిమాలో చిన్న రోల్ చేసింది. ఆ తరువాత 1985 లో హమ్ నౌజవాన్ లో దేవ్ ఆనంద్ కూతురిగా యాక్ట్ చేసింది టబు. తెలుగులో వెంకటేష్ తో కూలి నెంబర్ 1 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. హిందీ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ వంటి అనేక భాషా చిత్రాల్లో నటించిన టబు వయసు ఇప్పుడు 47 సంవత్సరాలు. స్టయిల్ బ్యాచిలర్ గా ఉంటూ.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. టాలీవుడ్ లో మన్మధుడు నాగార్జున, బాలీవుడ్ లో టబులకు వయసు పెరిగే కొలది అందం కూడా పెరుగుతుండటం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu