నానితో అదితి!


హీరో నాని వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని తరువాత విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో గ్యాంగ్‌ లీడర్‌ సినిమాను ఎనౌన్స్‌ చేశాడు. ఈ రెండు సినిమాల విడుదలకు ముందే మరో సినిమాను కూడా ఫైనల్‌ చేశాడు నాని. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మెహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు నాని.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నానికి జోడిగా అదితి రావ్‌ హైదరిని హీరోయిన్‌గా తీసుకున్నారట. గత చిత్రం సమ్మెహనంలో హీరోయిన్‌గా నటించిన అదితిని ఈ సినిమాలో తీసుకునే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు ఇంద్రగంటి. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరో సుధీర్‌ బాబు కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.