HomeTelugu Trending'రాజుగారి గది' తమన్నా ప్లేస్‌లో మరో నటి

‘రాజుగారి గది’ తమన్నా ప్లేస్‌లో మరో నటి

2 1ప్రముఖ యాంకర్‌, దర్శకుడు ఓంకార్‌ తెరకెక్కించిన ‘రాజుగారి గది’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ ఉత్సాహంతోనే ‘రాజుగారి గది 2’ తీశారు. ఇప్పుడు మూడో భాగం కూడా మొదలైపోయింది. ఇందులో తమన్నాను హీరోయిన్‌గా ఎంపికచేసుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలైన కొద్దిరోజుల్లోనే తమన్నా సినిమా నుంచి తప్పుకొన్నారట. ఆమె హిందీలో ‘బోలే చూడియా’ అనే సినిమాకు సంతకం చేయడంతో డేట్లు కుదరక ఈ సినిమా నుంచి తప్పుకొన్నట్లు చిత్రవర్గాల సమాచారం. అయితే ఆమె స్థానంలో ఓంకార్‌.. నటి తాప్సిని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారట.

‘గేమ్‌ ఓవర్’, ‘బద్లా’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి క్రైమ్‌ థ్రిల్లర్‌, హారర్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాల్లో తాప్సి నటించారు. ఇలాంటి జోనర్‌లో తెరకెక్కే సినిమాలకు ఆమె సరిగ్గా సరిపోతారని భావించిన ఓంకార్‌..’రాజుగారి గది 3’లో తాప్సిని ఎంపికచేసుకోవాలని అనుకుంటున్నారట. ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu