నాలుగు పాత్రలతో ‘చిత్రలహరి’ టీజర్‌

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా చేస్తున్న ‘చిత్రలహరి’ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదల అయింది. అప్పట్లో దూరదర్శన్ లో ఆదివారం రోజున వచ్చే ఓ ప్రోగ్రామ్.. 2019 లో చిత్రలహరి ఫ్రైడే రోజున రిలీజ్ కాబోయే సినిమా.. ఆ సినిమాలోని కొన్ని పాత్రలు అంటూ టీజర్ ను ఓపెన్ చేశారు. ఈ సినిమాలోని నాలుగు మెయిన్ పాత్రలను పరిచయం చేశారు. అబ్బాయిలంతా ఒక్కటే.. పరిచయం కాకముందు ఒకలా.. అయ్యాక ఒకలా ఉంటారనే అనే ఫీలింగ్ తో ఉండే నివేత…

డిస్కస్ చేయాలి.. తెలుసుకోవాలి.. నీడ్ సమ్ టైమ్ అంటూ డైలమాలో ఉండే కళ్యాణి ప్రియదర్శన్… జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండే సునీల్, జీవితంలోను సినిమాలోనూ విజయం కోసం ప్రయత్నం చేసే సాయి ధరమ్ తేజ్.. ఈ నలుగురివి నాలుగు డిఫరెంట్ పాత్రలు. ఈ పాత్రలను సీరియస్ గా ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కిషోర్ తిరుమల. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. టీజర్ తో మంచి మార్కులు కొట్టేసిన సాయి ధరమ్ తేజ్.. ఏప్రిల్ 12 న ఏం చేస్తాడో చూడాలి.