పుట్టినరోజు సందర్భంగా కాజల్‌ ‘రణరంగం’ ఫస్ట్‌లుక్‌

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ బుధవారం తన 34వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘రణరంగం’ చిత్ర బృందం.. అభిమానులకు కానుకగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుధీర్‌ వర్మ ట్విటర్‌ వేదికగా కాజల్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ‘అందమైన మనసున్న సుందరి కాజల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘రణరంగం’ సినిమా కోసం మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని గొప్ప ప్రాజెక్టుల్లో మీరు నటించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశారు. ‘ధన్యవాదాలు.. మీతో కలిసి పనిచేయడం నా అదృష్టం’ అని కాజల్‌ రిప్లై ఇచ్చారు.

‘రణరంగం’ సినిమాలో శర్వానంద్‌ హీరో పాత్ర పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే సినిమాలో శర్వా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దీనికి విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రంలో ఆయన రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు తెలిసింది. ఆగస్టు 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates