HomeTelugu Trending'అహింస' గ్లింప్స్‌ విడుదల

‘అహింస’ గ్లింప్స్‌ విడుదల

AHIMSA First Glimpse

డైరెక్టర్‌ తేజ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అహింస’. ఈ సినిమాతో రానా ద‌గ్గుబాటి త‌మ్ముడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గ‌తంలోనే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా పోస్ట్‌పోన్ అవుతూ వ‌చ్చింది. కాగా ఇటీవ‌లే మేక‌ర్స్ ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది చివ‌ర్లో విడుద‌ల కానుంది. ఇక‌ ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌లైన ప్రీ లుక్, పోస్ట‌ర్ సినిమాపై మంచి అంచ‌నాలు పెంచేశాయి.

తాజాగా మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. ఈ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. గీతికా తివారి హీరోయిన్‌గా న‌టించింది. ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ ప‌తాకంపై పి. కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆర్‌పీ ప‌ట్నాయ‌క్ సంగీతం అందించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu