Mokshagna Debut Movie:
నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తారు అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. వారి ఆశలను నిజం చేస్తూ.. త్వరలోనే మోక్షజ్ఞ టాలీవుడ్ లో హీరోగా పరిచయం కాబోతున్నారు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చెల్లెలు, లెజెండరీ నటి శ్రీదేవి రెండవ కూతురు అయిన ఖుషి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అని టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ అన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం నందమూరి మోక్షజ్ఞ ఇప్పుడు వైజాగ్ లో ఉన్నారట. వైజాగ్ లో మోక్షజ్ఞ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అది పూర్తి అయ్యాక సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయం.. బాలకృష్ణ పర్యవేక్షణలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ కూతురు తేజస్వి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
మరోవైపు బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. నిన్న భారీ స్థాయిలో వేడుకలు జరిగాయి. అందులో భాగంగా చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు చాలామంది ఈ వేడుకకు హాజరై బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.