HomeTelugu Trendingప్రభాస్‌ సినిమాలో ఎయిర్‌టెల్‌ బ్యూటీ

ప్రభాస్‌ సినిమాలో ఎయిర్‌టెల్‌ బ్యూటీ

Airtel ad girl sasha in pra
ఎయిర్‌టెల్ వాణిజ్య ప్రకటన ద్వారా మోడల్‌ సాషాకు మంచి గుర్తింపు వచ్చింది. తన అందం.. నటనతో ఆ యాడ్ కే ఈ అమ్మాయి కొత్త అందాన్ని తెచ్చింది. తాజాగా ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో నటించే అవకాశాన్ని పొందింది. రాధాకృష్ణకుమార్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా ‘రాధేశ్యామ్’ సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. పూజ హెగ్డే కథానాయికగా ఈ చిత్రం రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతోంది. ఇందులో సాషా ఓ ముఖ్య పాత్ర పోషించింది. ఈమె పాత్ర కథలో కీలకమైనదని, ఆమెకు మంచి గుర్తింపు వస్తుందనీ అంటున్నారు.

కాగా సాషా గతంలో కూడా ఓ తెలుగు సినిమాలో నటించింది. ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ చిత్రంలో ఆమె నటించింది. అయితే, ఆ సినిమా ఆమెకు గుర్తింపు రాలేదు. అందుకే, ఇప్పుడు ‘రాధేశ్యామ్’పై ఈ చిన్నది ఆశలు పెట్టుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu