HomeTelugu Trendingఆమె అందాన్ని మాటల్లో వర్ణించలేం.. ఐశ్వర్య వీడియో వైరల్‌

ఆమె అందాన్ని మాటల్లో వర్ణించలేం.. ఐశ్వర్య వీడియో వైరల్‌

11 6

ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన ఈ మాజీ ప్రపంచ సుందరికి సంబంధించిన డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 1997లో ఐశ్వర్య రాయ్‌ నటించిన సినిమా ‘రాధేశ్యం సీతారాం’. సునీల్‌ శెట్టి హీరో. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేదు. ఈ సినిమా సెట్‌లో ఐశ్వర్య డ్యాన్స్‌ రిహార్సిల్స్‌ చేస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. అందులో ఆమె ఊదా రంగు లెహెంగాలో మెరిసిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘ఆమె నుంచి చూపుతిప్పుకోలేకున్నా, ఆమె అందాన్ని మాటల్లో వర్ణించలేం, మన దేశానికి గర్వకారణం ఆమె, ఐశ్వర్య చాలా అందంగా ఉన్నారు..’ అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఐశ్వర్య 2018లో ‘ఫన్నేఖాన్‌’ సినిమాలో కనిపించారు. ఇందులో ఆమెతోపాటు అనిల్‌ కపూర్‌, రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న భారీ ప్రాజెక్టు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’కు ఐశ్వర్య సంతకం చేశారు. విక్రమ్‌, కార్తి, జయంరవి, త్రిష, శోభితా ధూళిపాళ్ల, అదితిరావు హైదరి తదితరులు ఇందులో నటించబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu