
Suzhal 2 release date:
సౌత్ ఇండియన్ నటి ఐశ్వర్యా రాజేష్ ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ విజయంతో టాప్ ఫామ్‌లో ఉంది. అదే జోష్‌ను కొనసాగిస్తూ, ఇప్పుడు ఆమె మరో హిట్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2022లో విడుదలైన ‘సుశాల్: ది వార్టెక్స్’ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్‌గా ‘సుశాల్ 2’ రాబోతోంది.
ఫిబ్రవరి 28, 2025న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్‌సిరీస్ తమిళంతో పాటు తెలుగు సహా ప్రధాన భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ సీజన్‌లో ఐశ్వర్యా రాజేష్, కథిర్ తమ పాత్రలను తిరిగి పోషించనున్నారు. మొదటి సీజన్‌లోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలు ఈసారి మరింత ఉత్కంఠభరితంగా ఉండనున్నాయని మేకర్స్ చెబుతున్నారు.
ఈ వెబ్‌సిరీస్‌ను విక్రమ్ వేదా దర్శక ద్వయం పుష్కర్ – గాయత్రి రూపొందించగా, వాల్‌వాచర్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. సుశాల్ 2 కు ప్రఖ్యాత దర్శకులు బ్రమ్మా, శర్జున్ KM దర్శకత్వం వహిస్తున్నారు.
సిరీస్‌లో లాల్, సరవణన్, గౌరి కిషన్, మోనిషా బ్లెస్సీ, సాయుక్త విశ్వనాథన్, శ్రీషా, అభిరామి బోస్, నిఖిలా శంకర్, రిని, కళైవాణి భాస్కర్, అశ్విని నంబియార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మరో విశేషం ఏంటంటే, ఈ సీజన్‌లో మంజిమా మోహన్, కాయల్ చందన్ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వనున్నారు.
సుశాల్: ది వార్టెక్స్ మొదటి సీజన్‌లో అద్భుతమైన మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండడంతో ప్రేక్షకులు రెండో సీజన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుండటంతో మరింత ఆసక్తి నెలకొంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 28 నుండి స్ట్రీమింగ్ కానున్న సుశాల్ 2 ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి!