
Suzhal 2 OTT release date:
అమెజాన్ ప్రైమ్ వీడియో అందిస్తున్న కంటెంట్ నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2022లో ఈ ఓటిటి ప్లాట్‌ఫామ్ విడుదల చేసిన వెబ్ సిరీస్ ‘సుజల్: ది వర్టెక్స్’ ప్రేక్షకుల మన్ననలు పొందింది. పుష్కర్-గాయత్రీ దర్శకత్వంలో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ షోకు విమర్శకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి.
అంతేకాకుండా, ‘సుజల్’ 2022లో ప్రపంచంలోని టాప్ ఇంటర్నేషనల్ టీవీ షోలలో ఒకటిగా ‘వారైటీ మ్యాగజైన్’ గుర్తింపు పొందింది. సీరీస్ సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా మేకర్స్ సీరీస్ రెండో భాగంపై పనిచేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ‘సుజల్ 2’ ఫిబ్రవరి 21, 2025న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
Much awaited Tamil Webseries #Suzhal2 will streaming on Prime From Feb 21st 🌪️ pic.twitter.com/4Oc4oDWg7c
— Ayyappan (@Ayyappan_1504) January 17, 2025
ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్ అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో కతిర్, రాధకృష్ణన్ పార్థిబన్, శ్రీయా రెడ్డి, హరిష్ ఉత్తమన్, ఇళంగో కుమారవేల్, నివేదితా సతీష్, గోపికా రమేష్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ‘సుజల్ 2’ మరింత గ్రాండ్‌గా రూపొందించబడుతోంది. ఇందులో మంజిమా మోహన్, గౌరి కిషన్, సమ్యుక్త విశ్వనాథన్ వంటి పలువురు ప్రముఖులు కూడా నటించారు.
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా? ‘సుజల్ 2’ మరింత ఉత్కంఠభరితమైన కథ, కొత్త పాత్రలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుందా? అన్నది ఫిబ్రవరి 21న తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ ప్రసారానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.