
Top 10 Most Viewed Indian Teasers 2025:
తెలుగులో టీజర్ అంటే ఓ చిన్న వీడియో మాత్రమే కాదు – అది ఓ పెద్ద ఈవెంట్ లాంటిదే! ఇప్పుడు టీజర్ రిలీజ్ అవుతుందంటే అభిమానులు వేచి చూస్తూ ఉంటారు. రిలీజ్ అయిన వెంటనే షేర్ చేయడం, రిపీట్‌లో చూడడం, ట్రెండింగ్‌లో పెట్టడం లాంటివి కామన్ అయిపోయాయి.
ఇప్పుడు యూట్యూబ్‌లో టాప్ 10 ఇండియన్ టీజర్లు ఎంతమంది వీక్షించారో లిస్టు బయటకు వచ్చింది. ఇందులో హీరో ప్రభాస్ ఓ రేంజ్‌లో దూసుకెళ్తున్నాడు. ఆయన సినిమాల టీజర్లకు యూట్యూబ్‌లో విపరీతమైన స్పందన లభించింది.
టాప్ 10 టీజర్ల లిస్టు (24 గంటల్లో వీక్షణల ఆధారంగా):
1. సలార్ – 83 మిలియన్
2. ఆదిపురుష్ – 68.96 మిలియన్
3. KGF ఛాప్టర్ 2 – 68.83 మిలియన్
4. ద రాజా సాబ్ – 59 మిలియన్
5. రాధే శ్యామ్ – 42.66 మిలియన్
6. పుష్ప 2 – 39.36 మిలియన్
7. డంకీ – 36.8 మిలియన్
8. మైదాన్ – 29.5 మిలియన్
9. ఫైటర్ – 23.1 మిలియన్
10. యానిమల్ – 22.6 మిలియన్
ఈ లిస్టులో ప్రభాస్‌కు నాలుగు టీజర్లు ఉండటం విశేషం. ఆయన మాస్ హవా యూట్యూబ్‌లో కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. ముఖ్యంగా ద రాజా సాబ్ టీజర్ 59 మిలియన్లతో నాలుగవ స్థానం దక్కించుకుంది.
ALSO READ: బాలీవుడ్ నటుడు Govinda కెరీర్ నాశనం వెనుక అసలు కారణం ఇదేనా?