
Mega 157 Update:
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 157వ సినిమాగా డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్ – Mega 157గా షూటింగ్ మసూరీలో వేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో చిరు పాత్రే హైలైట్ కానుంది. ఆయన స్కూల్ డ్రిల్ మాస్టర్ శివశంకర్ వరప్రసాద్గా కనిపించబోతున్నారు. స్కూల్ సెట్టింగ్‌లో వచ్చే కామెడీ సీన్లు తెగ నవ్వించనున్నాయట. చిరంజీవి మార్క్ టైమింగ్, అనిల్ రావిపూడి కామెడీ టచ్ కలిస్తే మజా మామూలుగా ఉండదు.
ఇప్పటివరకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎనిమిది సినిమాల్లో ఒక్కదీ ఫ్లాప్ కాలేదు. ఆయనకు ప్రేక్షకుల పల్స్ అర్థం అవుతుంది. ఈ సినిమా కూడా అదే లెక్కలో బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.
ఈ సినిమాలో నయనతార, కాథరిన్ త్రెసా ప్రధాన మహిళా పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార ఇప్పటికే షూటింగ్‌లో జాయిన్ అయింది. చిరు-నయన్ కాంబోకి సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.
ఈ సినిమాకు యాక్షన్ మరియు డాన్స్ కూడా బలంగా ఉండనున్నాయి. చిరంజీవి డాన్స్ మూమెంట్స్, స్టైల్ అన్నీ అభిమానులకు ట్రీట్‌గా మారబోతున్నాయి. యాక్షన్ సీన్లు కూడా హై బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
మొత్తానికి కామెడీ, యాక్షన్, ఎమోషన్, డాన్స్ అన్నీ ఉండే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్-చిరు కాంబో ఎలా పనిచేస్తుందో చూడాలి.
ALSO READ: బాలీవుడ్ నటుడు Govinda కెరీర్ నాశనం వెనుక అసలు కారణం ఇదేనా?