
Chiranjeevi Next Movie Heroine Demands:
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ ప్రస్తుతం మసూరీలో వేగంగా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. టైటిల్‌గా సంక్రాంతి అల్లుళ్లు అనే పేరు పరిశీలనలో ఉంది.
ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సినిమా ప్రారంభానికి ముందే నయనతార కొన్ని షరతులు పెట్టిందట. ముఖ్యంగా సినిమా ప్రమోషన్లలో పాల్గొనాలంటే అదనపు రెమ్యూనరేషన్ అవసరం అని ఆమె స్పష్టం చేసినట్టు టాక్.
View this post on Instagram
సాధారణంగా నయనతార తన సినిమాల ప్రమోషన్స్‌కు రావడం అరుదే. కానీ ఈసారి డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాకు ప్రమోషన్ తప్పనిసరి అని ముందుగానే ఆమెను ఒప్పించారట. దీనికి నయన్ కూడా ఓకే చెప్పినా, ప్రమోషన్ కోసం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. మేకర్స్ కూడా ఆమె స్టార్ ఇమేజ్‌ని గుర్తించి ఈ డిమాండ్‌ను అంగీకరించారని సమాచారం.
ఇది చిరంజీవి సినిమా అయినా సరే, నయనతార తన మార్క్ షరతులతో నిలిచిన విధానం చిత్రబృందాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందని అంటున్నారు ఫిల్మ్ వర్గాలు. ప్రస్తుతం షూటింగ్ మసూరీలో జరుగుతోందిగా, ప్రమోషన్ల కోసం ప్రత్యేక ప్లానింగ్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
మెగా అభిమానులు ఇప్పుడు ఈ సినిమాలో చిరు–నయన్ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలని ఎదురుచూస్తున్నారు.