
Govinda Blockbuster Movies:
ఒకప్పుడు బాలీవుడ్‌ను గోవిందా ఒక్కరే ఏలేశాడు. కామెడీ, డాన్స్, ఎమోషన్… ఏ అంశంలోనైనా పరిపూర్ణత చూపించిన గోవిందా, హిట్ మీద హిట్ కొడుతూ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అయితే ఒక్కసారిగా ఆయన సినిమాల నుంచి దూరమవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా ప్రముఖ నిర్మాత పహలాజ్ నిహలానీ గోవిందా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పారు – “గోవిందా ఒక ఆల్‌రౌండర్. కానీ అతని బలహీనత ఏమిటంటే అతను చాలా ఈజీగా నమ్మేస్తాడు. పండితులు, జ్యోతిష్కులు, ఫార్చూన్ టెల్లర్స్ లాంటి వారిని చుట్టుపక్కల పెట్టుకోవడం వల్ల అతని కెరీర్ దెబ్బతింది.”
View this post on Instagram
అలాగే ఆయన మాట్లాడుతూ – “గోవిందా సింగిల్ స్క్రీన్ హీరో. మల్టీప్లెక్సులు రావడంతో అతని సినిమాలను విడుదలే కాకుండా, నడవనివ్వలేదు. ‘పార్ట్నర్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చిన సినిమాలు ప్రేక్షకులకు చేరేలా చేయలేదు,” అని అన్నారు.
ముఖ్యంగా డైరెక్టర్ డేవిడ్ ధావన్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. “డేవిడ్ ధావన్ గోవిందా మనసులో నాతో సంబంధించి విషం నింపాడు. అతనికి నేను డబ్బులు సంపాదించానని అనిపించింది. కానీ వాస్తవం ఏమిటంటే, నా సినిమాల ద్వారానే అతనికి పేరు వచ్చింది,” అని నిహలానీ పేర్కొన్నారు.
ALSO READ: Salman Khan కొత్త SUV స్పెషలిటీలేంటో తెలుసా?