HomeTelugu Trendingహైదరాబాద్‌లో అజిత్‌ సైక్లింగ్‌.. ఫొటోస్‌ వైరల్‌

హైదరాబాద్‌లో అజిత్‌ సైక్లింగ్‌.. ఫొటోస్‌ వైరల్‌

Ajith cycling on hyderabad
తమిళ స్టార్ హీరో అజిత్ ‘వాలిమై’ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కంప్లీట్ చేసుకుంది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి బోనీ కపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌ నటి హ్యుమా ఖురేషీ హీరోయిన్‌గా నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న అజిత్ సైక్లింగ్ తో కాస్త జర్నీ చేశారు. ఆయన సైక్లింగ్ చేస్తున్న పిక్స్ బయటకు రాగా.. వాటిని ఫ్యాన్స్‌ వైరల్‌ చేశారు. హైదరాబాద్ నుంచి కోల్‌కతా మీదుగా ఫ్రెండ్స్‌తో కలిసి అజిత్ సైక్లింగ్ చేయగా, తన స్నేహితులు ఈ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అజిత్ తన ఫేస్‌ను ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేలా క‌వ‌ర్ చేస్తూ..సైక్లింగ్ చేశాడు. అజిత్‌కు హైద‌రాబాద్‌తో విడదీయరాని బంధం ఉంది. అజిత్ సికింద్రాబాద్‌లోనే జన్మించారు. తెలుగులో పలు సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాలేదు..తమిళంలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu