వకీల్ సాబ్ బిగ్ అప్‌డేట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం వకీల్ సాబ్. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, బోనీకపూర్ కలిసి నిర్మాణం చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను మరో 4 రోజుల్లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో పవన్‌తో మరోసారి శ్రుతిహాసన్ జోడీ కడుతోంది. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. పింక్ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఈనెల 29న విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates