HomeTelugu Newsనయనతార సినిమాలో 'రంగం' విలన్‌

నయనతార సినిమాలో ‘రంగం’ విలన్‌

11 15
ప్రముఖ నటి నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘నెట్రిక్కన్‌’లో మరో నటుడు చేరారు. ‘రంగం’, ‘అభినేత్రి 2′ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అజ్మల్‌ అమీర్‌ ఇందులో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు వెల్లడించారు. ”నెట్రిక్కన్‌’ సినిమా రెండు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఒక పాత్రను నయనతార పోషిస్తున్నారు. మరొకటి నేను చేస్తున్నా. ఇది ఎన్నో మలుపులున్న చిత్రం. దీని కోసం నైపుణ్యం ఉన్న సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వస్తుందనే నమ్మకం నాకుంది” అని ఆయన చెప్పారు.

మిలింద్‌రావ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. విఘ్నేశ్‌ శివన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నయన్‌ అంధురాలి పాత్రను పోషిస్తున్నట్లు టాక్‌. ‘బ్లైండ్‌’ అనే కొరియన్‌ సినిమా ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. సీరియల్‌ కిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనా ఎఫెక్ట్‌తో తత్కాలికంగా షూటింగ్‌ను నిలిపివేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu