సురేష్ ప్రొడక్షన్స్ లో చైతు సినిమా!

నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి వారాహి చలన చిత్రం సంస్థ నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం నేడు పలువురు సినీ ప్రముఖులు మరియు ఆత్మీయుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది.

కృష్ణ ఆర్.వి.మరిముతు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘పెళ్లి చూపులు’ ఫేమ్ వివేక్ సాగర్ సంగీత సారధ్యం వహించనుండగా.. శతచిత్ర కథానాయకుడు శ్రీకాంత్ కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం. వారాహి చలన చిత్రం ఆఫీస్ లో లాంఛనంగా జరిగిన ఈ ప్రారంభ వేడుకకు సురేష్ బాబు, ఎస్.ఎస్.రాజమౌళి, కీరవాణి, విజయేంద్రప్రసాద్, శ్రీకాంత్, గుణ్ణం గంగరాజు, దేవినేని ప్రసాద్, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. “సురేష్ బాబుగారితో కలిసి వారాహి చలనచిత్రం బ్యానర్ లో నాగచైతన్య హీరోగా సినిమా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించనుండగా.. శ్రీకాంత్, రావు రమేష్ లు కీలకపాత్రలు పోషించనున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి గుణ్ణం గంగరాజు క్లాప్ కొట్టగా.. ఎం.ఎం.కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. సురేష్ బాబు, దేవినేని ప్రసాద్ లు స్క్రిప్ట్ ను దర్శకుడు కృష్ణ ఆర్.వి.మరిముతుకు అందించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది” అన్నారు.

ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ – అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మరిముతు!