చిరంజీవి స్థాయిని మేం తగ్గించలేదు!

అల్లు అర్జున్, హరీష్ శంకర్, దిల్ రాజు కాంబినేషన్ లో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఆ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అని వంద కోట్ల కలెక్షన్స్ దాటిందని చిత్రబృందం ప్రకటించింది. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు ఆఫీస్ వద్ద మెగాభిమానులు నిన్న ఆందోళన చేశారు. చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ కంటే ‘డిజె’కు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలు ప్రకటిస్తున్నారని మెగా ఫ్యాన్స్ గొడవ చేశారు. అంతేకాదు కలెక్షన్స్ కు సంబంధించిన లెక్కలు చూపించమని డిమాండ్ చేశారు.

ఈ విషయంపై స్పందించిన దిల్ రాజు.. కొందరు కావాలనే వివాదాలను తెర లేపుతున్నారని అన్నారు. చిరంజీవి రేంజ్ చాలా ఎక్కువని అది ఎప్పటికీ తగ్గదని అన్నారు. చిరు సినిమాకు, డిజె సినిమాకు పోలిక పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. చిరంజీవి వల్లే ఆయన కుటుంబం నుండి చాలా మంది హీరోలు వచ్చారని చెప్పారు. అటువంటి ఆయన మేం ఏ మూలన తగ్గించలేదని
స్పష్టం చేశారు.