నీహారికతో సినిమా చేసిన మాట నిజమే!

అక్కినేని అఖిల్ టాలీవుడ్ లో తెరంగేట్రం చేసే సమయంలో మెగాడాటర్ నీహారికతో సినిమా చేస్తున్నాడనే వార్తలు వినిపించాయి. అఖిల్, నీహారిక కాంబినేషన్ లో సినిమా అనేసరికి అభిమానులు బాగా ఎగ్జైట్ అయ్యారు. అయితే వారి కాంబోలో సినిమా అయితే రాలేదు.. తాజాగా ఈ విషయంపై స్పందించిన అఖిల్.. నీహారికతో సినిమా చేసిన మాట నిజమే. కానీ అది ఫీచర్ ఫిల్మ్ కాదు.. షార్ట్ ఫిల్మ్. రాజమౌళి గారి కొడుకు కార్తికేయ ఓ షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్నాడు. అందులో నీహారికను, నన్ను ఎంపిక చేసుకున్నాడు. అది షార్ట్ ఫిల్మ్ అయినప్పటికీ చాలా రోజులు షూటింగ్ నిర్వహించాం. దాదాపు 120 మంది కాస్ట్ అండ్ క్రూ దానికి వర్క్ చేశారు. 
మేము అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయింది. ఆ షూటింగ్ చూసిన కొందరు ఇది ఫీచర్ ఫిల్మ్ అయి ఉంటుందని ఊహించుకున్నారు. ఆ విధంగా నేను, నీహారికతో కలిసి డెబ్యూ ఫిల్మ్ లో నటించబోతున్నాననే వార్తలు బయటకు వచ్చాయని అఖిల్ స్పష్టం చేశాడు. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ అనుకున్న విధంగా రాలేదని, ఆ కారణంగానే విడుదల చేయలేదని అన్నారు. ఇక విడుదల చేసే ఛాన్సులు కూడా లేవని వెల్లడించారు. అదన్నమాట మేటర్.. ప్రస్తుతానికి అఖిల్.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.