పూరీ హీరో కోసం స్టార్ హీరోలు!

ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ పూరీ జగన్నాథ్ రూపొందిస్తోన్న చిత్రం ‘రోగ్’. ఈ సినిమా తెలుగు, కన్నడ బాషల్లో రిలీజ్ కు సిద్ధపడుతోంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను బెంగుళూర్ లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్ కి సుదీప్ .. పునీత్ రాజ్ కుమార్ .. శివరాజ్ కుమార్ అతిథులుగా రానున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి భారీ స్థాయిలో ప్రచారాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే కన్నడ స్టార్స్ ను ఆహ్వానించినట్టు చెప్పుకుంటున్నారు. మన్నారా చోప్రా.. ఏంజెలా హీరోయిన్స్ గా నటించగా, అనూప్ ఠాకూర్ విలన్ పాత్రను పోషించాడు. సునీల్ కశ్యప్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.
తెలుగు ఈ సినిమా ఇషాన్ మంచి ఓపెనింగ్స్ ఇస్తుందని చిత్రబృందం ఆశీస్తోంది. పూరీ జగన్నాథ్ కూడా తెలుగులో ఇషాన్ స్టార్ హీరో అవుతాడని స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు.