ఇంట్రడక్షన్ సాంగ్ కోసం ప్రాణలకు తెగించిన అఖిల్‌!

అక్కినేని అఖిల్ తన మూడో సినిమా వెంకీ అట్లూరి డైరక్షన్ లో ‘మిస్టర్ మజ్ఞు’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభంలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి వుంది. ఈ సాంగ్ లో అఖిల్ షర్ట్ విప్పేసి, సిక్స్ ఫ్యాక్ తో డ్యాన్స్ చేసాడట. అయితే సిక్స్ ఫ్యాక్ స్క్రీన్ మీద పెర్ ఫెక్ట్ గా ప్రొజెక్ట్ కావాలి అని.. సాంగ్‌ షూట్ అయినన్ని రోజులు ఏమీతినకుండా, జస్ట్ ఒక్క లీటర్ వాటర్ మాత్రం తాగుతూ చాలా కష్టపడ్డాడట అఖిల్‌.

ఒక దశలో ఈ డైట్‌ వల్ల ఏమైన అపయం జరుగుతుందేమో అనే భయంతో చిత్రం ఆక్సిజన్ సిలెండర్ కూడా తెచ్చి, ఫస్ట్ ఎయిడ్ సెటప్ సిద్దంచేసారట. అంతలా కష్టపడి సిక్స్ ప్యాక్ చూపిస్తూ.. అఖిల్ ఈ సాంగ్ చేశాడట. ఈ సినిమాని బోగవిల్లి ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు, ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలకానుంది