HomeTelugu Trendingఅక్కినేని సుశాంత్‌ న్యూలుక్‌.. వైరల్‌

అక్కినేని సుశాంత్‌ న్యూలుక్‌.. వైరల్‌

Akkineni Sushant New Look..
టాలీవుడ్‌లో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు హీరో సుశాంత్. కాళిదాసు, కరెంట్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ‘చిలసౌ’ వంటి కథా ప్రాముఖ్యమున్న చిత్రంతో సుశాంత్‌కు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో సుశాంత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగానే అల వైకుంఠపురములో చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించాడు. అయితే ఈ సినిమాలో సుశాంత్‌ కనిపించింది తక్కువే అయిన తన నటనతో మెప్పించాడు.

లుక్‌ పరంగానూ ‘అల వైకుంఠపురములో’ కొత్తగా కనిపిస్తాడు సుశాంత్. తన తదుపరి ప్రాజెక్ట్ ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రం కోసం మరింత స్టైలీష్‌గా రెడీ అవ్వబోతోన్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ బాగా వైరల్ అయ్యాయి. ఈ కరోనా, లాక్ డౌన్ వంటివి రాకపోతే ఈపాటికి సినిమా విడుదలైపోయేంది. అయితే ఈ లాక్‌డౌన్‌ టైమ్‌లో సుశాంత్‌ తన లుక్‌ని పూర్తిగా మార్చేశాడు. న్యూ హెయిర్‌ స్టైల్‌లో కనిపించాడు. ప్రస్తుతం సుశాంత్ షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu