HomeTelugu Trendingదుర్గామతి టైటిల్‌ ఛేంజ్‌

దుర్గామతి టైటిల్‌ ఛేంజ్‌

Durgavathi as durgmati
టాలీవుడ్‌లో అనుష్క నటించిన హీరోయిన్‌గా నటించిన హిట్‌ మూవీ ‘భాగమతి’. ఈ సినిమాకి ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం అనుష్కకు నటిగా మంచి పేరును తేవడంతో పాటు బాక్సాఫీసు వద్ద కూడా ఈ చిత్రం విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. తెలుగు మాతృకకు దర్శకత్వం వహించిన అశోక్ దీనికి కూడా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో భూమి ఫడ్నేకర్ హీరోయిన్‌గా నటించింది. దీనికి మొదట్లో ‘దుర్గావతి’ అనే పేరును నిర్ణయించారు. అయితే, తాజాగా దీనిని కాస్త సవరించారు. ‘దుర్గామతి’గా ఈ టైటిల్ని మార్చడం జరిగింది. ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. వచ్చే నెల 11న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా ఇది విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu