బీచ్ ఒడ్డున హాట్‌గా రంగమ్మత్త

ఒకవైపు యాంకర్ గా బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా మారిన ఈ సుందరికి కాస్త సమయం దొరకడంతో తన ఫ్యామిలీతో సహా టూర్ వెళ్ళింది. బీచ్ ఒడ్డున ఉన్న ఓ హోటల్ లాంజ్ లో క్యాజువల్ షర్ట్, షార్ట్ తో దర్శనం ఇచ్చింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో ట్రెండ్ అవుతున్నది.

బుల్లితెరపై సాంప్రదాయ బద్దంగా కనిపిస్తూ.. సడెన్ గా ఇలా అల్ట్రా మోడ్రన్ గెటప్ లో కనిపిస్తే.. షేర్ చేయకుండా కుర్రకారు ఊరుకుంటారా చెప్పండి. బుల్లి తెర యాంకర్ గా మెరుపులు మెరిపిస్తున్న అనసూయ.. వెండితెరపై కూడా అప్పుడప్పుడు జిగేలు మంటూ మెరుస్తున్నది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర చేసిన తరువాత అనసూయ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.