బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్ బహిరంగ లేఖ

ఇండియా గురించి అవగాహన ఉన్న వ్యక్తుల్లో బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్ ఒకరు. ఇండియా కోసం సామాజిక మాధ్యమాల్లో ఏదోఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాడు. ఇండియా డెవలప్ కావాలని కోరుకునే వ్యక్తుల్లో అక్షయ్ కూడా ఒకరు. అందులో ఎలాంటి సందేహం లేదు. తన సినిమాల ద్వారా కూడా అదే తెలుస్తుంది. ఇండియాపై ఇంతటి అభిమానం ఉన్న అక్షయ్ కు ఇండియాలో పౌరసత్వం లేకపోవడం, కెనడా పౌరసత్వంతో ఇండియాలో ఉండటం వివాదంగా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటు వేయకపోవడంతో అక్షయ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు అక్షయ్ సోషల్ మీడియా ద్వారా ఓ లేఖ రాశారు. తనకు కెనడా పౌరసత్వం ఉన్నా.. ఇండియాలోనే ఉంటున్నానని, గత ఏడేళ్లుగా కెనడా వెళ్లలేదని చెప్పిన అక్షయ్, ఇక్కడ సినిమాలు చేస్తూ.. ఇక్కడే టాక్స్ కడుతున్నట్టు పేరుకొన్నారు. ఇండియా చాలా స్ట్రాంగ్ కంట్రీగా మారుతుందని.. ఇండియా డెవలప్మెంట్ లో తాను కూడా భాగస్వామ్యం అవుతానని అంటున్నాడు అక్షయ్.

CLICK HERE!! For the aha Latest Updates