HomeTelugu Trendingఅక్షయ్‌ కుమార్‌ 'పృథ్వీరాజ్‌' మూవీ ట్రైలర్‌

అక్షయ్‌ కుమార్‌ ‘పృథ్వీరాజ్‌’ మూవీ ట్రైలర్‌

Prithviraj movie trailer

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పృథ్వీరాజ్’‌. చంద్రప్రకాష్‌ ద్వివేది డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో.. సంజయ్ దత్‌, అశుతోష్‌ రాణా, సోనూ సూద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మిస్‌ వరల్డ్‌ 2017 మానుషి చిల్లర్‌ ఈ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవల విడుదలై ఈ మూవీ టీజర్‌ ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మే 9న రిలీజ్ చేశారు మేకర్స్. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నిర్భయ, శక్తివంతమైన యోధుడు సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవితం ఆధారంగా రూపొందించారు. 2 నిమిషాల 50 సెకన్ల ఈ ట్రైలర్‌లో విజువల్స్‌, యాక్షన్ సీన్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. పీరియాడికల్ యాక్షన్‌ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu