HomeTelugu Trendingఅవకాశం వస్తే ఆ ఇద్దరి బయోపిక్స్‌లో నటిస్తా: ధనుష్‌

అవకాశం వస్తే ఆ ఇద్దరి బయోపిక్స్‌లో నటిస్తా: ధనుష్‌

Hero Danush wants to act in

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ వరుసపెట్టి సినిమాలు చేస్తూ జోరు మీద ఉన్నాడు. తమిళ సినిమాల్లోనే కాదు.. టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌ అంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ డైరెక్షన్‌ వహించిన బాలీవుడ్‌ సినిమాలో ‘అత్రాంగి రే’ ఓటీటీలో విడుదలైంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ధనుష్‌.. ప్రస్తుతం ఆ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నాడు. ఈ సందర్భంగా బయోపిక్‌ల ప్రస్తావన రావడంతో తను ఎవరి బయోపిక్‌లో నటించాలనుకుంటున్నాడో వెల్లడించాడు.

ఓ మీడియా సమావేశంలో బయోపిక్‌పై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ధనుష్‌ సమాధానమిస్తూ.. అవకాశం వస్తే తాను రజనీకాంత్‌, ఇళయరాజా బయోపిక్స్‌లో నటిస్తానని తెలిపాడు. వారిద్దరూ చిత్రసీమకు ఎంతో సేవ చేశారని, తనకు వారంటే ఎంతో గౌరవమని చెప్పాడు. అందుకే వారిద్దరి బయోపిక్స్‌లో నటించాలనే కోరిక ఉందన్నాడు. ‘అత్రాంగి రే’ లో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌తో కలిసి ధనుష్‌ నటించాడు. సారా అలీఖాన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఏఆర్‌ రెహమాన్‌ నేపథ్య సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఆనంద్‌ ఎల్‌. రాయ్‌, భూషణ్‌ కుమార్‌, హిమాన్షు శర్మ, కృష్ణన్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. మరోవైపు ధనుష్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ ద్విభాష చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి చిత్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకి ‘సార్‌'(తమిళ్‌లో వాతి) అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!