మాస్టర్‌ దర్శకుడుకి కరోనా


మాస్టర్ డైరెక్టర్‌ లోకేష్ కనగరాజ్ కరోనా పాజిటివ్ అంటూ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా తెలియజేశాడు. తనకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. కొన్ని రోజులుగా తనతో కలిసిన వారు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అలాగే ప్రస్తుతం లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా పేర్కొన్నాడు. లోకేష్ కనగరాజ్ కరోనా బారిన పడటం పట్ల ఆయన అభిమానులు మరియు సినీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దంగల్ బ్యూటీ ఫాతిమా సోషల్ మీడియాలో నాకు కరోనా పాజిటివ్ తెలిపింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ లో హోం క్వారెంటైన్ లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు కూడా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని వీరిద్దరు చెప్పుకొచ్చారు.

CLICK HERE!! For the aha Latest Updates