HomeTelugu Trendingఫొటోగ్రాఫర్‌గా మారిన అక్షయ్‌ కుమార్‌

ఫొటోగ్రాఫర్‌గా మారిన అక్షయ్‌ కుమార్‌

Akshay kumar turns photogra
బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్ సాధారణంగా ఖాళీగా ఉన్న సమయాల్లో తనలోని ఇతర ప్రతిభలను కూడా చూపిస్తుంటారు. కరాటే, వంట చేయడం అంటే అక్షయ్‌కు ఇష్టం. అయితే తాజాగా అక్షయ్ తనలోని మరో ప్రతిభను భయటపెట్టారు. ఈ సారి తనలోని ఫొటో గ్రాఫర్‌ను కూడా మేల్కొలిపారు. ప్రస్తుతం అక్షయ్ బచ్చన్ పాండే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అక్షయ్ సరసన కృతి సనన్ నటిస్తున్నారు. ఇటీవల కృతి తన ఇస్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. అంతేకాకుండా బచ్చన్ పాండే సెట్స్ నుంచి, ఈ ఫొటోను అక్కి కాప్చర్ చేశారంటూ రాసుకొచ్చారు. ఆ ఫొటో ఫోస్ట్ అయిన కొన్ని గంటల్లోనే వేల వ్యూస్, కామెంట్లు వచ్చాయి. కృతి బచ్చన్ పాండే సెట్‌లో ఉన్నప్పుడు అక్షయ్ ఈ పొటోను తీశారు. ఇందులో కృతి ముఖంపై ఎండా, నీడా పడుతూ ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ఫొటో అందరినీ ఆకర్షిస్తుంది. ఈ ఫొటోకు బచ్చన్ పాండే నిర్మాత సజిద్ నడియాడ్‌వాలా భార్య వార్దా గార్జియస్ అంటూ స్పందించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)

Recent Articles English

Gallery

Recent Articles Telugu