Jigra OTT release date:
బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ‘జిగ్రా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వసన్ బాల దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాకు విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కానీ, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
ఈ చిత్రాన్ని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ‘జిగ్రా’ డిసెంబర్ 6, 2024న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. అయితే, ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేయలేదు.
#Jigra (Hindi) Streaming from December 6th on Netflix #OTT_Trackers pic.twitter.com/0omeLVwg8R
— OTT Trackers (@OTT_Trackers) November 21, 2024
ఈ చిత్రంలో ఆలియా భట్‌తో పాటు వేదాంగ్ రైనా, మనోజ్ పాహ్వా, రాహుల్ రవీంద్రన్, మరికొందరు ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా మ్యూజిక్ డైరెక్టర్లుగా అచింత్ ఠక్కర్, మన్ప్రీత్ సింగ్ పనిచేశారు. బలమైన కథ, టెక్నికల్ టీమ్ ఉన్నప్పటికీ, సినిమా ప్రేక్షకుల మనసులను దోచుకోవడంలో నిరాశ పరిచింది.
‘జిగ్రా’ ను ఆలియా భట్‌తో పాటు ఆమె సోదరి షాహీన్ భట్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమన్ మిశ్రా నిర్మించారు. ఈ సినిమాలో ఆలియా నటన హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా అలియా చాలా బాగా నటించింది.
సినిమాకు వచ్చిన మిశ్రమ స్పందన ఆలియా భట్ అభిమానులను కొంత నిరాశపరిచింది. యాక్షన్ డ్రామాగా.. ఆద్యంతం ఆసక్తికరంగా నడిచే కథ ఉన్నప్పటికీ, సినిమా కథనం సరిగా ఆకట్టుకోలేకపోయిందని విశ్లేషకులు పేర్కొన్నారు. విడుదల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో వచ్చే వ్యూస్ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడతాయి అని చూడాలి.
ALSO READ: ఈ Bollywood heroines భారతదేశంలో వోట్ వేయలేరు.. ఎందుకంటే!