HomeTelugu Trending'ఎన్టీఆర్ 30' మూవీ నుంచి అలియా అవుట్‌!

‘ఎన్టీఆర్ 30’ మూవీ నుంచి అలియా అవుట్‌!

Alia bhatt walks out of ntr

టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ‘ఎన్టీఆర్ 30’. కొరటాల డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్ 30’ పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న గ్రామీణ యాక్షన్ ఎంటర్‌టైనర్‌. ఇక ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ కాస్త బ్రేక్ తీసుకుని ఈ సినిమాను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. జూన్ మొదటి వారంలో ఈ సినిమా స్టార్ట్ అవుతుందని ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు. అప్పటి వరకు మేకోవర్ పై దృష్టి పెట్టనున్నారు తారక్. ఇప్పటికే ఎన్టీఆర్ కు సంబంధించిన కొత్త లుక్ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ను ఫిక్స్‌ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. హీరోయిన్ విషయమై అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ హీరోయిన్ అలియానే అంటూ ప్రచారం జరిగింది. దానికి తోడు అలియా భట్ స్వయంగా కొరటాల శివతో చర్చలు జరిగినట్టు, ఈ ప్రాజెక్ట్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తన చిత్రం ‘గంగూబాయి కతియవాడి’ ప్రమోషన్లలో వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నుంచి అలియా తప్పుకుంది అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

ఏప్రిల్ 14న రణబీర్ లో ఐదేళ్ల డేటింగ్ కు స్వస్తి పలికి, పెళ్లి పీటలెక్కేసింది. అయితే ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకుందని, అందుకే ‘ఎన్టీఆర్ 30’నుంచి తప్పుకుందని ఇప్పుడు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు బాలీవుడ్ లోనే సినిమాలు చేయనుందని, అందులోనూ గ్లామర్ ను తగ్గించి, కేవలం పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండే పాత్రలనే అలియా ఎంచుకోవాలని అనుకుంటుంది అంటున్నారు. దీంతో గందరగోళంలో పడడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వంతయ్యింది. మరి ఇందులో నిజమెంత తెలియాలంటే ‘ఎన్టీఆర్30’ హీరోయిన్ గురించి అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!