‘సుడిగాడు’ కాంబో రిపీట్!

అల్లరి నరేష్ ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరోగా తెరపై నవ్వుల పువ్వులు పూయించేవాడు. కానీ రాను రాను అతడి కామెడీలో పంచ్ లు తగ్గుతుండడం, అతడి బదులుగా టీవీలో కామెడీ షోలు ఎక్కువ అవుతుండడంతో అతడి క్రేజ్ బాగా తగ్గింది. కొంతకాలంగా అల్లరి నరేష్ ఏ సినిమా చేస్తున్నా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతోంది. ఈ క్రమంలో అతడు తదుపరి సినిమాపై మరింత దృష్టి పెడుతున్నాడు.

ఇటీవలే దర్శకుడు ఇ.సత్తిబాబుతో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. గతంలో వీరిద్దరు కలిసి ‘నేను’,’బెట్టింగ్ బంగార్రాజు’,’యముడికి మొగుడు’ వంటి సినిమాలకు పని చేశాడు.

ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెడుతున్నాడు. గతంలో అల్లరి నరేష్ హీరోగా భీమనేని శ్రీనివాసరావు ‘సుడిగాడు’ అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకాదర దక్కింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కబోతుందని తెలుస్తోంది. మరి ఈసారి ఎలాంటి సక్సెస్ ను అందుకుంటారో చూడాలి!