మరోసారి తండ్రీకొడుకులు కలిసి తెరపై!

నాగార్జున, నాగచైతన్య గతంలో విక్రం కె కుమార్ దర్శకత్వంలో ‘మనం’ సినిమాలో నటించారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని సమాచారం. రీసెంట్ గా ‘శతమానం భవతి’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన
సతీష్ వెగ్నేస కొన్ని రోజుల క్రితం నాగార్జునను కలిసి కథ వినిపించాడట.

కథ నాగ్ కు నచ్చినప్పటికీ చూద్దాంలే అన్నట్లుగా పక్కన పెట్టేశాడట. తాజాగా సతీష్ ‘శతమానం భవతి’ చిత్రంతో హిట్ కొట్టడంతో నాగ్ తో సినిమా పట్టలేక్కించే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నాగార్జునతో పాటు చైతు కూడా కలిసి నటిస్తాడట. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగ్ ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. అలానే చైతు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.