బన్నీ ‘ఏ ఏ 19’ టైటిల్‌ ఇదేనా?

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏ ఏ 19’ షూటింగ్ వేగంగా జరుగుతున్నది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అనేక అంచనాలు ఉన్నాయి. ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్నది.

సినిమా టైటిల్స్ విషయంలో త్రివిక్రమ్ చాలా కొత్తగా ఆలోచిస్తారు. అచ్చతెలుగు పేర్లు సినిమా టైటిల్స్ గా పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అనే దానిపై అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.

అందులో కొన్ని టైటిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి టైటిల్స్ లో ఒకటి ‘అలకనంద’, రెండోవది ‘నాన్న.. నేను’. ఈ రెండు పేర్లలో ఒకటి సినిమాకు ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. రెండు పేర్లు కూడా చాలా బాగున్నాయని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.