HomeTelugu Big Storiesనా సంతోషాల సమూహం.. కూతురికి బన్నీ విషెస్

నా సంతోషాల సమూహం.. కూతురికి బన్నీ విషెస్

allu arjun birthday wishes

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ గారాల పట్టి ‘అల్లు అర్హ’ గురించి ప్రత్యేకించి చెప్పానసరం లేదు. సోషల్‌ మీడియాలో అర్హకి మంచి క్రేజ్‌ ఉంది. కళ్లెదుట తన ముద్దుల కూతురి అల్లరిని చూసి మురిసిపోతుంటానని గతంలో పలు ఇంటర్వ్యూల్లో కూడా పంచుకున్నాడు. సోషల్ మీడియా మాధ్యమాల్లో తరచూ అర్హకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసే అల్లు అర్జున్‌ మరో వీడియోను పంచుకున్నాడు.

తాజాగా 7వ పుట్టినరోజు జరుపుకుంది ‘అల్లు అర్హ’. ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు అర్హ మంగ‌ళ‌వారం త‌న‌ 7వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన గారాల పట్టికి బన్నీ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు అర్హకు సంబంధించిన ఫొటోల‌తో పాటు ఒక జిఫ్ వీడియోను అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు.

‘ నా సంతోషాల సమూహం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. డాడీ ముద్దులు పెడుతుంటే దూరంగా జరుగుతూ, చేతులు అడ్డుపెట్టుకుంటూ వీడియోలో అర్హ కనిపించింది. కూతురిని చూస్తూ అల్లు అర్జున్ మురిసిపోతూ కనిపించాడు. సన్ గ్లాసెస్ ధరించి స్టైలిష్ లుక్‌లో అర్జున్ కనిపించాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కూతురిపట్ల ప్రేమ చూపిస్తున్న తమ అభిమాన హీరోని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. తండ్రీకూతుళ్ల ప్రేమ చూడముచ్చటగా ఉందని, ఎల్లప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!