ఆదిపై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. అది కోసేస్తా బిడ్డ.. అంటూ వార్నింగ్‌


‘జబర్దస్త్’ కమెడియన్‌ హైపర్ ఆదిపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి విరుచుకుపడింది. తనదైన శైలిలో బూతులు మేళవించి ఓ పదునైన పోస్టును ఫేస్‌బుక్ ద్వారా వదిలింది. సీనియర్ జర్నలిస్టు, ‘కుండబద్దలు’ యూట్యూబ్ ఛానెల్ యజమాని కాటా సుబ్బారావుపై ‘జబర్దస్త్’ కార్యక్రమంలో హైపర్ ఆది వేసిన సెటైర్లను ఉద్దేశించి శ్రీరెడ్డి ఈ పోస్ట్ పెట్టింది.

‘ఆదిగా ఈ మధ్య పొట్టతో పాటు గు.. కూడా బాగా బలిసిందిరా. వ..లు వలిసేస్తాం జాగ్రత్త. కబర్దస్త్ స్టేజ్ అంటే ఎర్రకోటలో పీఎం ప్రసంగం అనుకుంటున్నావా?? కబర్దస్త్ లేకపోతే కుక్కలు చింపిన విస్తరి నీ బతుకు. ఒళ్లు జాగ్రత్త. సు.. కోసేస్తా బిడ్డ. కాగితం పులి గాడు వీడు. జర్నలిస్ట్ జోలికొస్తే ఉ.. పోయిస్తాం బిడ్డ’ అని తన ట్వీట్‌లో శ్రీరెడ్డి పేర్కొంది. అసలు, శ్రీరెడ్డి ఇంత వైల్డ్‌గా స్పందించేంతగా ఆది ఏమన్నాడు?

కాటా సుబ్బారావు తన ‘కుండబద్దలు’ ఛానెల్ ద్వారా గతంలో ఆదిపై విమర్శలు చేశారు. టీవీ9లో నిర్వహించిన ఒక షోలో పాల్గొన్న ఆది కాస్త అతిగా మాట్లాడాడు. ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిపై వెటకారంగా సెటైర్లు వేస్తూ, వాళ్లకేం తెలుసంటూ చాలా ఎక్కవగానే మాట్లాడాడు. జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్‌ను ఏమైనా అంటే తాటతీస్తాం అని కూడా హెచ్చరించాడు. ఇవన్నీ కాటా సుబ్బారావుకు ఆగ్రహం తెప్పించాయి. అసలు ఈ ఆది ఎవరు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఓ వీడియో వదిలారు. దీంతో ఆది తానేం తక్కువ తినలేదంటూ ‘జబర్దస్త్’లో ‘తీటా సుబ్బారావు’ అని సంబోధిస్తూ సెటైర్లు వేశాడు. తాట తీస్తానంటూ హెచ్చరించాడు. ఇదంతా జరిగిపోయిన కథ.

ఈ కథను ఇటీవల శ్వేతా రెడ్డి తన ఇంటర్వ్యూలో కాటా సుబ్బారావు వద్ద ప్రస్తావించారు. అలా ఎందుకు తాను స్పందించాల్సి వచ్చిందో కాటా సుబ్బారావు వివరించారు. ఈ ఇంటర్వ్యూ వీడియోను కూడా శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోను షేర్ చేసిన అనంతరం ఆదిపై విరుచుకుపడింది. మరి దీనికి ఆది స్పందిస్తాడో లేదో చూడాలి. అతడు స్పందించినా అది ‘జబర్దస్త్’ వేదికపైనే ఉంటుందిలెండి.

CLICK HERE!! For the aha Latest Updates